KMM: వారంతపు సెలవులు, దీపావళి పండుగ సందర్భంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వరుసగా నాలుగు రోజుల సెలవులు ప్రకటించారు. ఈనెల 18, 19న శని,ఆదివారం వారాంతపు సెలవులు, 20న నరక చతుర్దశి, 21న దీపావళి సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్ కుమార్ తెలిపారు. తిరిగి ఈనెల 22 నుంచి మార్కెట్ కార్యకలాపాలు యదావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు.