MDK: జిల్లావ్యాప్తంగా 101 పాఠశాలలో జరిగిన జాతీయ అచ్చీవ్ మెంట్ సర్వే పరీక్షలో 2514 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.3వ తరగతిలో 772, 6వ తరగతిలో 741, 9వ తరగతిలో 1001 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు చెప్పారు. సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు,విద్యాశాఖ,మండల విద్యాధికారులు పరీక్షలను పరిశీలించారు.