NLG: హాలియాలోని పలు ప్రాంతాల్లో సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటళ్లు, షాపులపై తనిఖీలు చేపట్టి గ్యాస్ వినియోగం, సరఫరా వివరాలను పరిశీలించారు. అయితే గ్యాస్ ఏజెన్సీలు అధిక ధరలకు సిలిండర్లు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారిపై చర్యలు కనిపించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.