RR: కందుకూరు గ్రామపంచాయతీలో సర్పంచ్, కార్యదర్శుల సమక్షంలో తైబజారు వేలం నిర్వహించారు. వేలంలో గూడూరుకు చెందిన గోల్కొండ కుమార్ రూ.5,97,500 వేలంపాడి తై బజార్ గెలుచుకున్నారు. ఈ వేలం పాటల ద్వారా వచ్చే ఆదాయం గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులకు వినియోగిస్తారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాండు వేలం విజేతను సత్కరించారు.