WGL: జిల్లాలోని నూతన కలెక్టరేట్ భవనం ముందు కాకతీయ వైభవాన్ని ప్రతిబింబించే శిలా తోరణం లేకపోవడం చర్చనీయాంశమైంది. చారిత్రక ఓరుగల్లు గుర్తింపును నిలబెట్టేందుకు తోరణం ఏర్పాటు అవసరమని పలు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అధికారులు రూ.60 లక్షలతో నిర్మాణ ప్రతిపాదనలు పంపినప్పటికీ ప్రభుత్వ ఆమోదం ఇంకా రాలేదని తెలుస్తోంది.