SRCL: వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానములో అభివృద్ధి పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి నేడు ఆలయ ప్రధాన గేటుకు ఫ్లెక్సిని ఏర్పాటు చేశారు. పనుల కారణంగా భీమేశ్వరాలయంలో భక్తులకు కోడె మొక్కు, ఇతర ఆర్జిత సేవలు జరుగుతున్నాయని తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు.