BDK: భద్రాచలం నియోజకవర్గం చర్ల మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు నీలి అప్పలరాజు ఇటీవల అకాల మరణం పొందిన విషయం తెలిసిందే. శనివారం అప్పలరాజు దశదినకర్మలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పొదెం వీరయ్య చర్లలోని వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.