NRPT: మాగనూరు మండలం బసవేశ్వర జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు నిలిపివేయడంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి రైతులతో కలిసి ఈ నెల 17న జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. దాదాపు 4 గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి కారణం మాజీ ఎమ్మెల్యే అని మాగునూరు పోలీసులు బీఆర్ఎస్ నేతల పై కేసు నమోదు చేశారు.