WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ నాలుగు రోజులు సెలవులు ప్రకటించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. శనివారం వారాంత బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమ, మంగళవారాలు దీపావళి సందర్భంగా మార్కెట్ మూసి వేయనున్నారు. రైతులు పంటలు తీసుకురావద్దని సూచించారు. మళ్లీ బుధవారం నుంచి మార్కెట్ పునఃప్రారంభమవుతుంది.