NRML: దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం నెహ్రూ జయంతిని పురస్కరించుకొని రత్నాపూర్ కండ్లీలో నెహ్రూ విగ్రహానికి మార్కెట్ కమిటీ ఛైర్మన్ సామ భీమ్ రెడ్డితో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.