KMM: విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం పెంచాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం కల్లూరు మండలం పేరువంచ ప్రభుత్వ పాఠశాలను మంత్రి, జిల్లా కలెక్టర్ అనుదీప్, MLA రాగమయితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల నమోదు, పాఠశాల అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.