MLG: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నట్లు స్థానిక బీజేపీ శ్రేణులు తెలిపారు. పర్యటనలో భాగంగా ఆయన మేడారం జాతరను సందర్శిస్తారన్నారు. ముందుగా గట్టమ్మతల్లిని దర్శించుకుని అక్కడి నుంచి నేరుగా మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోనున్నారు. జాతర సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలిస్తారు.