HYD: జీహెచ్ఎంసీలో శివారు ప్రాంతాల విలీనం అధికారులకు తలనొప్పిగా మారింది. శివారు మున్సిపాలిటీలలో శానిటేషన్, తదితర పనులకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మొత్తం జీహెచ్ఎంసీని పునర్ వ్యవస్థీకరణ చేయాలని యోచిస్తున్నారు. మొత్తం 12 జోన్లు, 60 సర్కిళ్ళు ఏర్పాటు చేస్తే, అన్ని పనులు సులువుగా సాగుతాయని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా రూపొందించారు.