JGL: మల్యాల మండలం నూకపల్లి ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పల్సర్ బైక్పై వస్తున్న నాజాల్దిన్, ఎక్సెల్ బైక్పై వస్తున్న సుద్దాల నరసయ్య ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.