MHBD: తొర్రూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన శివార్ల ఎల్లమ్మకు చెందిన ఇంటి తాళాలు పగలగొట్టి 4 తులాల 8 గ్రాముల బంగారం, 130 తులాల వెండి, రూ. 10వేల నగదును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితురాలు ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గొల్లమూడి ఉపేందర్ తెలిపారు.