MDK: పెద్ద శంకరంపేట మండలం మూసాపేటకు చెందిన సంగమేశ్వర్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు. టేక్మాల్ మండలానికి చెందిన భార్య మానస ఆత్మహత్య చేసుకోవడంతో సంగమేశ్వరుని అరెస్టు చేశారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన సంగమేశ్వర్ ఈరోజు కోర్టుకు వెళ్లాల్సి ఉండగా, నిన్న రాత్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.