జనగామ పట్టణ కేంద్రంలో కుక్కల బెడద రోజురోజుకు ఎక్కువైపోతుంది. దీంతో స్కూల్ పిల్లలు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు కాలనీల్లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ.. ఇటీవల పలువురిపై దాడి చేశాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని కుక్కల బెడద నుంచి కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.