BDK: వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నేడు జూలూరుపాడు మండలంలో పర్యటిస్తారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ ఆదివారం రాత్రి ప్రకటించారు. ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారని అన్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. నాయకులు పర్యటన విజయవంతం చేయాలన్నారు.