HYD: బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద బోర్డులో పేర్కొన్న దానికంటే రెట్టింపు టాయిలెట్, బాత్ రూమ్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు వాపోయారు. బోర్డుపై టాయిలెట్ రూ.5 ఉండగా రూ.10, బాత్ రూమ్ రూ.10 ఉండగా రూ.30 వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరగా, అధికారులు స్పందించి హెచ్చరించారు.