AP: మాజీ మంత్రి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. టీడీపీ నేతల హత్యకు సంబంధించిన కేసులో వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ. 25వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని.. దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.