SKLM: నరసన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి చేయూత అందించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో వనిత మండలం వంతెన నిర్మాణం, బొంతు ఎత్తిపోతల పథకం, రాజుల చెరువు అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆయన వినతి సమర్పించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.