KNR: కరీంనగర్ పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియం, బస్టాండ్ వెనుక రోడ్డులో ప్రజలు చెత్త వేయకుండా మున్సిపల్ అధికారులు ఇనుప జాలిని ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని అధికారులు పదేపదే సూచించినా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. నగర పరిశుభ్రతను కాపాడటానికి అందరూ సహకరించాలని అధికారులు కోరారు.