WGL: చెన్నారావుపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకన్న విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పేరుతో మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు.