MNCL: బెల్లంపల్లి పట్టణంలో 18వ వార్డు కాంట్రాక్టర్ బస్తీలో దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని వార్డ్ ప్రజలు శ్రీనివాస్, తిరుపతి ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం తహశీల్దార్ లావిడియ కృష్ణకు వినతిపత్రం అందజేశారు. వార్డ్ లోని లక్ష్మణ్, తిరుపతి, ప్రశాంత్ ఇళ్ల చిరునామాతో BLO సంతకం లేకుండా పేర్లు నమోదు అయ్యాయని తెలిపారు. వెంటనే దొంగ ఓట్లు తొలగించాలని వారు కోరారు.