KMR: వాహనదారులందరూ రోడ్డు నిబంధనలు పాటించాలని ఎల్లారెడ్డి ఎస్సై మహేష్ సూచించారు. బుధవారం రాత్రి పట్టణంలో పోలీస్ సిబ్బందితో కలిసి ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారికి జరిమానాలు విధించారు. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు. ప్రతి వాహనదారుడు ధ్రువపత్రాలు ఉంచుకోవాలన్నారు.