NZB: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఎస్. కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. నవీపేట్ మండలం నాగేపూర్, నిజాంపూర్, నాలేశ్వర్, నవీ పేట్లలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ శనివారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం ధాన్యం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు.