NRPT: ధన్వాడ మండలం మండిపల్లి గ్రామ స్టేజి సమీప రహదారి గుంతలతో ప్రమాదకరంగా మారింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళ గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. ఇకనైనా అధికారలు చొరవ తీసుకుని రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరారు.