NLG: దేవరకొండ సీపీఐ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి ఈనెల 26న 100వ సంవత్సరంలో అడుగుపెడుతుందని అన్నారు. ఈనెల 30న నల్గొండ ఎన్జీ కళాశాలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.