NRML: పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు, నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి ఖానాపూర్ పట్టణంలో పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న పోలీస్ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.