BDK: భద్రాద్రి జిల్లాలో నిర్వహించనున్న టెట్ పరీక్ష అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న కీలక పరీక్షలుగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఈ పరీక్షను పకడ్బందీగా, పారదర్శకంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించబడతాయి అని స్పష్టం చేశారు.