KMM: ఖమ్మం మున్నేరు రిటైనింగ్ వాల్ వెంటనే పూర్తి చేయాలని CPM జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని ముంపు ప్రాంతాలను సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్నేరు వరద ప్రవాహాన్ని పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. రెండు వాల్స్ మధ్య నిడివి బాగా పెంచాలని, 2013 భూచట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలన్నారు.