JGL: వివిధ ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న ఓల్లెపు కాశీరాం, దండుగల ఎల్లయ్య, బోదాసు సాయిలుతో పాటు చోరీ చేసిన బంగారాన్ని కొనుగోలు చేసిన వెంకటా చారిని అరెస్టు చేసినట్లు, మెట్పల్లి సీఐ అనిల్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 20వేల నగదు, 15 గ్రాముల వెండి వస్తువులు, 4 మొబైల్ ఫోన్లు, దొంగతనాలకు ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.