MDK: నర్సాపూర్ మండలం ఆవంచ రైతు వేదిక వద్ద శుక్రవారం మండల వ్యవసాయ అధికారి దీపిక రైతులకు యూరియా పంపిణీ ప్రారంభించారు. మండల కేంద్రంలో ఒకే చోట యూరియా పంపిణీ వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, రైతులు ఇబ్బంది కలగకుండా రైతు వేదికల వద్ద యూరియా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తామన్నారు.