ASF: తిర్యాణి మండలం ఎదులాపాడ్లో ఆదివారం గిరిజన ఉద్యమ నేత వెడ్మ రాము 38వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి ఎమ్మెల్యే కోవలక్ష్మి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆదివాసీ గిరిజన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వెడ్మ రాము త్యాగాలను ఆమె స్మరించుకున్నారు. గిరిజనుల ఆత్మగౌరవం కోసం, హక్కుల కోసం పోరాడిన మహనీయుడు వెడ్మ రాము అన్నారు.