SRD: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం శుక్రవారం చేపట్టిన బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట హరిహర కిషన్ గురువారం ప్రకటనలో తెలిపారు. పద్మశాలి సంఘం సభ్యులు బంద్‌లో క్రియాశీలకంగా పాల్గొనాలని పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు.