కామారెడ్డి జిల్లా మద్నూర్ మార్కెట్లో కందుల ధర పెరిగిందని వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం కందులు క్వింటాకు రూ.8,100 ధర పలుకుతోందని పేర్కొన్నారు. కేవలం రెండు రోజుల్లో క్వింటాకు రూ. 300 ధర పెరిగిందన్నారు. మహారాష్ట్ర అడత్ మార్కెట్ ధరకు అనుగుణంగా ఇక్కడ ధర ఉంటుందన్నారు. జోరుగా కందుల కొనుగోలు జరుగుతోందని రైతులు వెల్లడించారు.