NRML: ఆదివారం సారంగాపూర్ మండలం చించోలి గ్రామ సమీపంలో నూతన కోర్టు భవనాల నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తులు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సుజన మాట్లాడుతూ.. కోర్టు భవనాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి న్యాయ సేవలకు వినియోగంలోకి తేవాలని అన్నారు. న్యాయమూర్తులు లక్ష్మణ్, నర్సింగ్ రావు ఆధునీకరణతో న్యాయ సేవలు మరింత వేగవంతమవుతాయని అన్నారు.