WGL: నర్సంపేట పట్టణంలోని బస్టాండు సమీపంలో ఇవాళ నర్సంపేట సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో భాగంగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.