కామారెడ్డి: యువ వికాసం బస్సులను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జెండా గోపి ప్రారంభించారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు కామారెడ్డి నుంచి పెద్దపల్లికి బస్సులో జిల్లా యువకులు వెళ్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో రంగనాథరావు పాల్గొన్నారు.