NRPT: మాగనూరు మండలంలోని గురురావు లింగంపల్లి, తాళం కేరి గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మూడో విడత నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో.. గురురావు లింగంపల్లి సర్పంచ్‌గా ఈడిగి లక్ష్మీదేవమ్మ, తాళంకేరి సర్పంచ్‌గా ఉప్పరి పోలమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో వారిని గ్రామస్తులు వారిని సన్మానించారు.