KNR: సైదాపూర్ మండలంలోని ఆకునూరు సబ్స్టేషన్ పరిధిలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 33కేవీ లైన్ పనుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందని ఏఏఈ కె.శ్రీనివాస్ తెలిపారు. ఆకునూరు, గొల్లగూడెం, పెర్కపల్లి, శివరాంపల్లి, సర్వాయిపేట, వెంకటేశ్వర్లపల్లి, ఘనపూర్, ఎన్.తండ గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు.