KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల పలు దశల్లో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. యాసంగి పంటల కోసం బుధవారం రోజు ఔట్ ఫ్లో 255 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాగా 28 క్యూసెక్కులు నీరు ఆవిరిగా మారుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు యాసంగికి 0.652 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ నీటిమట్టం 1.820 టీఎంసీలు ఉంది.