SDPT: కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోఛనీయమని ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విష జ్వరాలు, పాము, ఎలుక, కుక్కకాట్లు, ఫుడ్ పాయిజనింగ్తో విద్యార్థులు ఆసుపత్రుల పాలై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాపురించిందన్నారు. గురుకులాల్లో పనిచేస్తున్న 2500 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు అని విమర్శించారు.