NZB: ముంబై తర్వాత NZBలోనే వినాయక వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నగరంలోని మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవ శోభాయాత్రలో పాల్గొన్నారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ వినాయకుడి ఆశిస్సులు ఉండాలని మహేశ్ కుమార్ గౌడ్ కోరారు.