PDPL: ధర్మారం మండలంకు చెందిన సుంచు మల్లేశం, కొక్కుల రామ్ నారాయణ ఇటీవల డాక్టర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు, మహాత్మ జ్యోతిబాపూలే నేషనల్ అవార్డు అందుకున్నారు. వారు ఇవాళ మంత్రి లక్ష్మణ్ కుమార్ను వెల్గటూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవలో మరిన్ని అవార్డులు స్వీకరించాలని మంత్రి ఆకాంక్షించారు.