JGL: రాయికల్ మండలం అల్లిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శశి ప్రియ రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీలకు ఎంపికైంది. కథలాపూర్ మండలం ఊట్పల్లిలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ పోటీల్లో ఈ బాలిక పాల్గొని 2 కి.మీ.ల విభాగంలో ప్రతిభ కనబరిచింది. జనవరి 2న హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు హెచ్ఎం కిరణ్, తెలిపారు.