HYD: 30 ఏళ్లకు పైగా జరిగిన ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన మాదిగ అమరవీరుల కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ డా. పిడమర్తి రవి కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే మాదిగలపై ఉన్న అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు.