NRPT: నర్వ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే వాకిటిశ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కందులకు ప్రభుత్వం మద్దతు ధర రూ.7,550 చెల్లించి కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.