JN: పేదోడి సొంతింటి కళ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతున్నదని పాలకుర్తి MLA యశస్విని రెడ్డి అన్నారు. కొడకండ్ల మండలంలో ఇవాళ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని, మొత్తం 22 మంది లబ్ధిదారులకు పత్రాలను అందచేశారు. పేద కుటుంబాలకు స్వంత ఇళ్లు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యలక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.