BDK: భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటుచేసిన కనకదుర్గ అమ్మవారి మండపంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొని అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు పేర్కొన్నారు.